Have an account?

Thursday, April 29, 2010

ఇష్టం.............

రేయి చాటున.. నీలి మేఘాల మాటు లొ దాగిన ఓ చందమామ..
నీ వెన్నల వెలుగులు...నాకెందుకే...!
నా చెలి నవ్వుల వెలుగుల లొ ...నీవెవరన్నది తెలిసేదెవ్వరికే...!
నా చెలి మువ్వల సవ్వడి కి ....తాళం వేసె ఓ చక్కని చుక్క ...
ఇక నీకొసం ఎదురు చూపులెందుకే ...నేల మీద నడిచే చుక్కే నా సొంతం ఆవ్వగా!

Monday, April 26, 2010

నిన్ను చుసిన నా మది పలికిన మాటలు.....

నిన్ను చూసిన క్షణం చుట్టూ శూన్యం , ఒక్క నీ అందాల మోము తప్ప.
నీ ఫై ప్రేమ పుట్టాక జగమంతా శూన్యం , ఒక్క నువ్వు అనే ఆలోచన తప్ప.
నీ వైపు అడుగులు వేసాక నేనే శూన్యం , ఒక్క నాలో వున్న నువ్వు తప్ప.
నిన్ను తలచిన ప్రతిక్షణం నా మనసంతా శూన్యం ,ఒక్క నీ మీద వున్న ప్రేమ తప్ప.
నీ ఫై నా ఈ ప్రేమను చెప్పాలని వుంది కానీ నువ్వు కాదంటే?
ఆ ఆలోచనే నా ఊపిరిని శాసిస్తుందే.
అలా అని నిన్ను వదిలి వెళ్ళే ధైర్యం నాకు లేదు..
అందుకే నీ నీడై నీ వెంటే వుంటూ నీ ప్రేమను గెలవాలని.......
ఈ జన్మకైనా కాకున్నా, మరుజన్మకైనా కాకున్నా, ఏనాటికైనా నీతో నే జీవించాలని తపనపడే నీ ప్రేమికుడు....




Saturday, April 24, 2010

మాటలకందని భావం ,మనసలు గెలిచే మంత్రం.....

ఎంటా మాటలకందని భావం అని ఆలోచిస్తున్నావా!

ముగ్ధ మనోహరమైన రూపం తో

సొగసైన చూపులతో కవ్విస్తూ













నీ మనసు లో మాట........

మనసు లో మాట కాదది గుండెలో రగిలే జ్వాలది..
ఆ జ్వాలంత ఒక్క సారిగా వెల్లువైన క్షణాన
నువ్వడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానమే లేదే...
నేను లేకుండా నువ్వెలా బ్రతక గలుగుతున్నావు అని అడిగితే
నా లో వున్న నీ ప్రేమ బ్రతికిస్తుంది అని చెప్పగలను.
ప్రేమ వుంటే చాల నేను ఉండక్కర్లేద అని అడిగితే
నా లోనే నా తోనే నువ్వెప్పుడు ఉంటావన్న నమ్మకం చాలాని చెప్పగలను.
అదే నువ్వు, నువ్వు కంట నీరు పెడితే అమ్మనైన మరిచి నీతో నే నడిచొచ్చే దానిని కదా రా
ఎందుకు నన్నిలా వదిలేసావు అని అడిగిన క్షణాన, నా నోట మాటే కాదు నా గుండె చప్పుడే ఆగిపోయిందే.

ప్రేమ...

ప్రేమ చూడడానికి రెండక్షరాలే కానీ ఈ మానవ మనుగడనే శాసించే ఆయుధం ప్రేమ...
అమ్మ పేగు బంధాన్నిరుచి చూసి కళ్ళుతెరవడం తో మొదలైన ఈ ప్రయాణం
ప్రేమ అనే ఒకే ఒక్క తియ్యని ఆలోచనలో సాగిపోతుంది.....
అమ్మ పెట్టె ముద్దలో ప్రేమ
నాన్న కొట్టే దెబ్బలోను ప్రేమ.
ఇలా మొదలైన ఈ జీవితం లో
అదే ప్రేమ అనే ఆలోచనవల్ల వచ్చే నరకం అనే బాధ ఎలావుంటుందో నీకు తెలుసా?
మగువ అనే రూపంలో వుంటుంది.
అమ్మ నాన్న ప్రేమ లో వున్నంత సంతోషం
నువ్వు నేను ప్రేమ లో వుండవు...
మగువను ప్రేమిచడం తప్పు కాదు కానీ
ఆ మగువ కోసమే ఈ జీవితం అన్నంత గా ప్రేమించడం తప్పు.
ఆ భ్రమ లో పడి తనువుని సైతం చాలించడానికి సిద్దపడే ఓ మగవాడ...నీకో విషయం తెలుసా!
నువ్వు జీవించే ఈ జీవితం నీది కాదు రా..
రక్తం పంచిన అమ్మది రక్తం ధారపోసి పెంచిన నాన్నది..
అలాంటప్పుడు వాళ్ళ ఊపిరిని తీసే హక్కు నీకెవరిచ్చారు ..
అమ్మ నాన్న కు నువ్వే ఊపిరి నీ ఊపిరి ఆగితే నీకంటే ముందు పోయేది వారి ప్రాణమే....తెలుసుకో....

Friday, April 23, 2010

మనసు లో వున్న భాద............

నిన్ను వదిలేక్షణం నాకు అర్థం కాలేదు
ఏమి జరుగుతోంది మరుక్షణం అని.
ఏముందిలే పక్కన ఉండదనే భాద తప్ప
నాలోనే వుంది గా అన్న ఊహతో బ్రతికేద్దామనుకున్న.
కానీ అప్పుడు తెలియలేదునాకు..
బ్రతకడానికి ఊహా వుంటే చాలదు..
ఊపిరి వుండాలి ఆ ఊపిరినే వదిలేస్తున్నఅని.
ఒక్కసారి జారవిడిచాక పొందటానికి
నువ్వేమి ఒక వస్తువు కాదు మరి నిన్నుపొందాలంటే?
నా ప్రాణాలని వదిలేయటం తప్ప ఏమి చేయగలను.....

Thursday, April 22, 2010

తనని చూసాక అప్సరసనే మరిచెదరేమో..

నా ప్రేయసి పేరులో ఏముందో తెలియదు కానీ
అందమైన తన మోములో రత్నాల మెరుపుందని తెలుసు.
కావ్యాన్ని వర్ణించడానికి కలం కావాలి కానీ
నా ప్రేయసి అందాన్ని వర్ణించడానికి అదృష్టం అనే వరం కావాలి.
అందం కాదది లేలేత సొగసది
ఎవరో కాదిది చూపులతో కవ్వించే
హోయలున్న సొగసరి ఎవ్వరే ఇది
అప్సరస కాదే ఇది నా ప్రేయసి.