Have an account?

Thursday, June 2, 2011

ఏమి చెయ్యగలను నేను.......

కళ్ళు తెరిచాను ..సోఖం అనే భావన చూసాను ..
పడుతూ లేస్తూ అడుగులు వేశాను ..బాధ అనే స్పర్శని చూసాను ..
అమ్మ అనే పిలుపును నేర్చాను ...ప్రేమ అనే మాయని చూసాను...
గుడిలో ఉన్న దైవాన్ని తలచాను ... భక్తీ అనే ముక్తిని చూసాను..
బడిలో పాటాలు చదివాను...లోకం అనే సముద్రాన్ని చూసాను...
అమ్మాయి ప్రేమలో పడ్డాను...తీయని వేదన చూసాను..
ఎన్ని తెలిసిన చివరకి చావుని చేరాను...
ఏమి చెయ్యగలను నేను.......... ఎన్ని చుసిన చావు అనే కౌగిలికి చిక్కడంతప్ప...

Wednesday, June 1, 2011

నిజం తెలుసుకో నిన్ను మలచుకో.......

అందరికి ఒక రోజు .....

అదే అండి కన్నవారికి ఒక రోజు...వున్నా దేశానికి ఒకరోజు..

పసిపాపలకి ఒకరోజు...ఇలా ఎన్నో రోజులు ఎన్నో ప్రేత్యేకతలు...

కాని వీటివల్ల ఎవ్వరికి నష్టం కాని కష్టం కాని లేదు....

ఇలానే ఒకరోజు ..చాలా ప్రేత్యేకమైన రోజు ...

ఎంటా అని ఆలోచిస్తున్నార..అదే అండి ప్రేమికుల రోజు...

కాని దీనివల్ల అన్ని నష్టాలే,కష్టాలతో కూడిన కన్నీళ్ళే..

ఆ కష్టం అనేది నాకు తెలిసి ...నాకేంటి అందరికి తెలిసి..ఆడది అనే రూపం లో వుంటుంది అనుకుంట...

మనసుని అద్డం తో పోలుస్తారు ..నిజమే కాని..

అది మగవాని కే సొంతం... నిజమే మగవాడికి ప్రేమ పుట్టడానికి టైం పడుతుంది...

కాని ఒక్కసారి పుట్టింద ..చచ్చే వరకి పట్టు వదలని విక్రమర్కుడే...

కాని ఆడవారికి అలా కాదు.. ప్రేమ పుట్టేది క్షణ కాలంలో ...పోయేది కనురెప్ప మూసే సమయం లో..

ఇది తెలియని ఎంతో అభాగ్యులు..వచ్చే ప్రేమికుల రోజు కోసం ఎదురు చూసి..

ప్రేమ లో వున్నవారు ప్రేయసి ఆనందం కోసం ...ప్రేమను పొందాలనుకునే వారు ప్రేయసి కరుణ కోసం..

ఏవేవో చేస్తూ ఎంతో తపన పడుతూ వుంటారు...వారందరికీ ఒక మాట..

నీడ నీ వెంటే వుంటుంది దాన్ని నమ్ము..అది నువ్వు చచ్చే వరకి తోడోస్తుంది...

కన్నవారు నీకోసమే బ్రతికే ఒకే ఒక్క ప్రాణి వారి కోసం బ్రతుకు ..వాళ్ళు నీ జీవితాంతం తోడుంటారు

కాని ఆడది నీ వెంటే వుంటుంది ..నువ్వు దాని మాట వినేంత వరకే..ఒక్కసారి..

నువ్వు లేదు కాదు..కష్టం, కొంచెం నా గురించి ఆలోచించు అనే మాటలు ..మాటవరసకైనా..

నీ నోటివెంట వచ్చాయో..అంతే నీకు నా మీద ప్రేమలేదు..ఇక నువ్వు నాకొద్దు?

ఇంకేముంది నీ మనస్సు పగులుతుంది..ఆమె మనసుకు కొత్తగా రెక్కలొస్తాయి ..

అమ్మ నీకోసం ఏదైనా చేస్తుంది నీ వెంటే వుంటుంది .అదే అమ్మాయి నువ్వు ఏదైనా చేస్తేనే నీతో వుంటుంది..

అమ్మ అమ్మాయి ఒకటే అంటావా..కాని అమ్మతనం అమ్మాయికి అమ్మ అయ్యాకే కదా వస్తుంది..

ఇంత విని రేపటి రోజు ప్రేయసి కోసం ఏమి చేద్దామ అని ఆలోచించకు ...

ఏమి చేస్తే నీ కన్నవారు సంతోషం గా ఉంటారా అని ఆలోచించు..

ఇట్లు...

?

Wednesday, May 4, 2011

ప్రాణం ఖరీదు...

సముంద్రం లోతు ఆడదాని మనసు ఒకటే...
సముద్రం లో మునిగిన ఆడదాని ప్రేమలో పడిన..
మునగడమే గాని తేలడం అనేది వుండదు..
ఎన్ని తెలిసిన చేసేదేముంది ఆడదాని లో ఏముందో ఏమో తెలీదు గాని..
దేవుడి కన్నా దాని చుట్టూనే ఎక్కువ తిరుగుతాం...
నువ్వు ఎంత తిరిగితే అంతా, తిప్పుకునే ఓపిక దానికే వుంది..
ఇంత తిరిగి దాని ప్రేమని పోందామె అనుకో..
నువ్వు చచ్చే దాక నీతో నే వుంటుందా... లేదు, కాని ఉంటానని చెప్తుంది...
నీకోసం ఏమైనా చేస్తానని కూడా చెప్తుంది ...
ఇలా ఎంతో ప్రేమని ఇష్టాన్ని..అంతెందుకు మన ఊపిరే తానై బ్రతికేస్తున్న తరుణం లో..
నీతో ప్రయాణం మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు...ఇక ఈ ప్రయాణం ఇక్కడితో ఆపేద్దాం...
అని అనే దైర్యం దాని కి ఉందేమో కాని ఆ మాట వినే దైర్యం కూడా మనకి లేదు..
అసలు ఈ అమ్మయిలకి ప్రేమించే ముందు తెలిదా అమ్మ నాన్న వున్నారని...
సరే ఒప్పుకుంటారు లేకపోతె ఒప్పిద్దామని అనుకుందే అనుకో ... ఆ ఆలోచన తర్వాత ఎందుకు వుండదు...
నేను అమ్మ నాన్న ని ఎదిరించమని చెప్పడం లేదు వాళ్ళు ఎవరికైన ఒక్కటే..
కాని నా జీవితం తో ఆడుకునే హక్కు దానికేవ్వరిచ్చారు...సరే అది ఆడుకుందే అనుకో..
దాని గురించే ఆలోచిస్తూ మన అమ్మ నాన్న మనసులతో ఆడుకోవటానికి మనం ఎవరం..
నిన్ను వద్దనుకున్న దాని కోసం ప్రాణాలను తీసు కోవలనుకునే ఓ అబ్బాయి.. వాటి మీద నీకేం హక్కు లేదు..
నిన్ను వద్దునుకున్న దాని గురించి ఆలో చిస్తూ ,నీకోసమే బ్రతుకుతున్న వాళ్ళని మర్చిపోతున్నావ్ ....
చివరి వరకు నీది అని చెప్పుకొనేది ఒక్క అమ్మే ..నీ కష్టం లో తోదోచ్చేది నాన్నే..

Thursday, November 4, 2010

భయం ...(జీవితం లో భయం వుండాలి కాని భయం తో జీవితాన్ని చూడకూడదు..)

జీవితం లో ఎన్నో పేజీలు , పేజీల్లో ఎన్నో కొట్టివేతలు, కొన్నే ఆణిముత్యాలు..
అలా కొన్నే ఆణిముత్యాల కోసం ఎన్ని భరించాలి ఎంత వేచి చూడాలి..
ఎంత కాలమైన వేచి చూడటానికి నేను సిద్ధం ....
కాని అలా వేచి చూడటం లో నాలో భయం అనే భావన రాకూడదు...అలా అని
రాబోయే ఆణిముత్యం కోసం సంతోషం గా ఎదురుచూడాలి అనే అత్యాశ లేదు..
కాని ... ఆణిముత్యం నా పేజీల్లో చేరిన చేరకపోయినా .....
నా జీవితాన్ని నేనే చాలించాలి అనే భావన కలిగించే భయం అనే ఆయుధం మాత్రం ..
నా జీవితం లో రాకుండా వుంటుంది అనే నమ్మకాన్ని ఇవ్వగలరా..
ఇవ్వ లేరు..ఖచ్చితంగా ఇవ్వలేరు...అలాంటప్పుడు..
చస్తూ బ్రతకలేక బ్రతికే జీవితం నీకు నాకు అవసరమా...
ఇన్ని తెలిసి చేసేదేముంది వాడు అదే ఆటలో, బొమ్మలా ఆడటం తప్పా....
కాని ఒక్కటి వాడు ఎంత ఆడిన ఆడించిన , భయం అనే వాడి ఆయుధాన్ని నీ దగ్గరకి రానివ్వకు నేస్తం.....
భయం అనే పదం లేని జీవితం కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితుడు....

Tuesday, May 4, 2010

దూరం...మోసం...మగువ

మానవుని జీవితం సుఖ దుఖాల నడుమ సాగిపోతూ...వుంటుంది
ఎన్నో కష్టాలు,కన్నీళ్ళ నడుమ మునుగుతూ తేలుతూ ...
సాగించే ఈ మానవ జీవితం లో ..ఇవన్ని సముంద్రం లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే అలజడుల లాంటివి..
కానీ మగవాని జీవితం లో ఏదో ఒక రోజు తారసపడే అతిపెద్ద సమస్య "మగువ"....
ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలతో పడుతూ లేస్తూ సాగిపోతున్న ఈ ప్రయాణం లో
మగువ అనే రూపం లో "మోసం" అనే ఒక సరికొత్త సమస్య నీకు ఎదురొస్తుంది....
మగువ! సమస్య ఏమ్మాట్లాడుతున్నావ్ నువ్వు నీకేమన్నా పిచ్చ అని అడగాలనిపిస్తుందా...
నిజమే ఈ జగాన అందం అభినయం ,ఇలా ఎన్నో ఎన్నెన్నో కలబోసినా రత్నాల రాసిని...
సమస్య తో పోల్చడం తప్పే ..కాని ఏమిచేయ్యను తప్పట్లేదు...
కనిపెంచిన అమ్మ, నాన్న మనతో వుండేది కొంతకాలమే ,కాని ఓ మగువతో నీ జీవితం కడవరకు సాగాలి...
ఇది బ్రహ్మ రాసిన రాత..ఎంత మంచివాడు ఆ బ్రహ్మ ,అమ్మ నాన్న లకు మించిన ప్రేమని ,అందాన్ని సగం
జీవితానికి మన సొంతం చేస్తున్నాడు అని అనుకున్నాను...తర్వాత కాని అర్థం కాలేదు ఎంత పని చేసాడో అని...
ఇంకా వుంది కాని ఇప్పుడు రాసే ఓపిక లేదు........

Saturday, May 1, 2010

మోసానికి అర్థం మగువ....

యుగాలు మారినా ఈ జగాన ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ మోసానికి అర్థం మగువ....
ఎవర్ని నమ్మాలి, ఈరోజు నువ్వు తప్ప నాకు వేరే లోకమే లేదు అన్న మగువ
జీవితాంతం నీతోనే నడుస్తుంది అన్న నమ్మకం వుందా....లేదు ఖచ్చితంగా లేదు
నిన్న నేడు రేపు అన్నవి ఎప్పుడు మారవు కాని ...
నిన్న నువ్వు, నేటి నువ్వు, రేపటి నువ్వు ప్రతి క్షణం మారుతూనే వుంటావు ఇది నిజం .......
నీకు నచ్చేది నేనా లేక నీకు నచ్చేలా జీవించే నేనా అన్న విషయం అర్థం అవ్వాలంటే ఏమి చెయ్యాలి....
ఏమి చేసినా అర్ధంకానంతగా నటించే నీ నటనకు మాటకు నేను దాసోహం....
ఇదంతా నటన అని తెలిసిన నాడు నీ నవ్వు చూడాలని ఎదురుచూసే నా కళ్ళు,
నీ సంతోషాన్ని కోరుకునే నా మనసు,
నీ మాటల వినికిడికి తాళం వేసే నా గుండె చప్పుడు
అన్ని ఇవన్ని ఒక్క సారిగా పని చెయ్యడం ఆగిపోతాయని నీకు తెలుసా...
నీకు నచ్చితే ప్రేమించు కాని నీ అవసరం కోసం ప్రేమించకు..
నీకోసం చచ్చేంత ప్రేమ వుంది కానీ నువ్వు నిజం కాదు అని అలోచించెంత ధైర్యం కూడా లేదే.....


Thursday, April 29, 2010

ఇష్టం.............

రేయి చాటున.. నీలి మేఘాల మాటు లొ దాగిన ఓ చందమామ..
నీ వెన్నల వెలుగులు...నాకెందుకే...!
నా చెలి నవ్వుల వెలుగుల లొ ...నీవెవరన్నది తెలిసేదెవ్వరికే...!
నా చెలి మువ్వల సవ్వడి కి ....తాళం వేసె ఓ చక్కని చుక్క ...
ఇక నీకొసం ఎదురు చూపులెందుకే ...నేల మీద నడిచే చుక్కే నా సొంతం ఆవ్వగా!